అందరి టీవీ డిజిటల్ న్యూస్: మిత్రుడి భార్యకు ప్రమాదంలో చేయి కోల్పోవడంతో రూ.8,600 ఆర్థిక సహాయం అందజేత...నర్సంపేట, వరంగల్ జిల్లా:
స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రభుత్వ బాలుర పాఎస్ఠశాలలో 2000–2001 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
తమ మిత్రుడు జెట్టబోయిన రాజేందర్ భార్య రోజువారీ పనిలో భాగంగా పనిచేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు మిషన్లో కుడిచేయి చిక్కుకుని చేయి కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న రాజేందర్ పూర్వ విద్యార్థి మిత్రులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి, తమ వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.
ఈ క్రమంలో మిత్రులందరి సహకారంతో సేకరించిన రూ.8,600 నగదును రాజేందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర పాఠశాల 2000–2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోలబోయిన నూతన్ కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి మిత్రుడికి తమ గ్రూపు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాజేందర్ కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని ఈ పూర్వ విద్యార్థులు తమ సేవా కార్యక్రమం ద్వారా నిరూపించారు. వారి ఆప్యాయత, ఐక్యత పలువురికి ఆదర్శంగా నిలిచాయి.
సహాయం అందించిన మిత్రులు
పోలబోయిన నూతన్ కుమార్, కామిశెట్టి రంజిత్ కుమార్, ఇప్ప సతీష్, మెండు శ్రీకాంత్, కందుకూరు మోహన్, వావిలాల బాబు, పోశాల యుగంధర్, ఆంగోతు బాలు, దెయ్యాల పరమేశ్, తోట ప్రవీణ్, చిలుక నరేందర్, బుషబోయిన చిరంజీవి, పుల్లూరు సుమన్, భోగ అశోక్, ఎలికట్టె రమేష్, అలకుంట బాబు, పుప్పాల రాజు తదితర మిత్రులు పాల్గొన్నారు.