అందరి టీవీ డిజిటల్ న్యూస్: ఖానాపురం, సెప్టెంబర్ 27:సెర్ప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ – నవ భారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఖానాపురం మండల కేంద్రంలో “అమ్మకు అక్షరమాల పరీక్ష”ను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నిరక్షరాస్యులైన తల్లులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరీక్ష రాశారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ అక్షరాస్యత దిశగా మహిళలు ముందడుగు వేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ దాసరి రమేష్, ఏపీఎం రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ, మహిళలు తలుచుకుంటే సాధించనిది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఖానాపురం గ్రామం పూర్తి అక్షరాస్యత గ్రామంగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అమ్మలు అక్షరాలు దిద్దుతూ, చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం నేర్చుకోవాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం రమాదేవి, సీసీ పద్మ, మహిళా సంఘాల సీఏలు శ్రీలత, శ్రీదేవి, సునీత, భవాని, హంసరాణి, సంఘ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.