రేపు వరంగల్ జిల్లా బార్ బంద్ రాష్ట్ర బంద్‌కు వరంగల్ జిల్లా బార్ ఓనర్స్ మద్దతు!.

Date: 2026-10-04
news-banner
వరంగల్ జిల్లాలో బార్ బంద్‌కు మద్దతు
ప్రివిలేజ్ ఫీజు పెంపును నిరసిస్తూ బార్ ఓనర్స్ నిర్ణయం!. అందరి టీవీ డిజిటల్ న్యూస్: వరంగల్, అక్టోబర్ 4: తెలంగాణ ప్రభుత్వం బార్లపై ప్రివిలేజ్ ఫీజును 10 శాతం నుంచి 16 శాతం వరకు పెంచేందుకు నిర్ణయించిన నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ బార్ & రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు వరంగల్ జిల్లా బార్ ఓనర్స్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, బార్ యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రివిలేజ్ ఫీజు పెంపుపై చర్చించి, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపు వరంగల్ జిల్లాలోని బార్‌లను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ రాష్ట్ర అసోసియేషన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా బార్ యజమానులందరూ బంద్‌లో పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో పాటు పలువురు బార్ యజమానులు పాల్గొన్నారు.
అందరి టీవీ డిజిటల్ న్యూస్...

Leave Your Comments