నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమ్మేటివ్ అసెస్మెంట్ బాహ్య మూల్యాంకనం ప్రారంభం

Date: 2026-10-03
news-banner
📰 అందరి టీవీ డిజిటల్ న్యూస్: నర్సంపేట, అక్టోబర్ 3:
నర్సంపేట మండల పరిధిలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9వ తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్ బాహ్య మూల్యాంకనం శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సంపేటలో ప్రారంభమైంది.
ఈ బాహ్య మూల్యాంకన ప్రక్రియలో మొత్తం 9 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు పాల్గొని విద్యార్థుల సమాధాన పత్రాలను నిబంధనల ప్రకారం మూల్యాంకనం చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి క్యాంప్ ఆఫీసర్‌గా నర్సంపేట మండల ఎంఈఓ బిక్షపతి వ్యవహరించగా, ఎవల్యూషన్ సెంటర్ ఇన్‌చార్జిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మూల్యాంకన ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు సీఆర్‌పీలు రవీందర్, సుధీర్, అనిల్, శ్రావణ్, అలాగే ఎంఐఎస్ కోఆర్డినేటర్ భరత్ తమ సేవలను అందిస్తున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేసే ఈ బాహ్య మూల్యాంకన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

Leave Your Comments