హన్మకొండలో కార్తీక మాస మహా దీపోత్సవం
, అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ ఆధ్వర్యంలో
* శివ పార్వతుల కళ్యాణం
* రుద్రాభిషేకం
* కుంకుమ పూజ
* దీపాలు వెలిగించుట
* శాస్త్రీయ నృత్యాలు
*భక్తి పాటలు ,ప్రవచనాలు
ఇతర భక్తి కార్యక్రమాలు
పవిత్ర కార్తీక మాసపు గాలిలో ఒక దీపం వెలిగితే చాలు
ఆ వెలుగు వందల హృదయాల్ని తాకుతుంది.
అటువంటి వేల దీపాల సముద్రంగా మారబోతోంది ఈ కార్తీక దీపోత్సవం.
ఇది కేవలం పూజా కార్యక్రమం కాదు భక్తి, శాంతి, సత్సంకల్పాల పండుగ.
ప్రతి దీపం ఒక మంత్రం, ప్రతి కాంతి ఒక మధుర స్మరణ.
అంధకారాన్ని తొలగించే ఆ దివ్య జ్వాలల్లో మన అంతరంగం స్నానమాడనుంది.
తేదీ: నవంబర్ 11, 2025 (మంగళవారం)
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
స్థలం: హన్మకొండ, పబ్లిక్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం
భక్తి భావంతో పూజలో పాల్గొనదలచిన దంపతులు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలి, కేవలం 30 కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉంది.
ఇది కార్తీక పౌర్ణమి సందర్భానికై జరగబోయే సామూహిక సౌభ్రాతృత్వ పుణ్య యాగం.
పేరు నమోదు కై సంప్రదించండి
ఎర్ర. ప్రసూన, కళావారం స్టేట్ కన్వీనర్ 99631 50841.
కామిశెట్టి రంజిత్ కుమార్ ,KBNR చీఫ్ కో ఆర్డినేటర్ 9059738940
కొండపల్లి దీపిక మహిళా విభాగం స్టేట్ కన్వీనర్ 93980 20571
కే .నాగజ్యోతి ,గ్రూప్ సెక్రటరీ 88014 52559
తడకమళ్ల వాణిశ్రీ ,మహిళా విభాగం హన్మకొండ జిల్లా కన్వీనర్ 97015 77168
ఈ యజ్ఞానికి ప్రవేశం ఉచితం.
సినీ, సాహిత్య, ఆధ్యాత్మిక, కళా, విద్యా రంగాల ప్రముఖులు విచ్చేసి మనలను ఆశీర్వదించనున్నారు.
వెలుగు అందరికీ సొంతం,
భక్తి అందరి హృదయంలో పుడుతుంది,
ఆ వెలుగు, ఆ ఆనందం ఇప్పుడు మీ కోసం వేచి ఉంది.
ఇది మన కార్తీక మాస మహా దీపోత్సవం, అందరూ ఆహ్వానితులే
ఇట్లు
బిటవరం శ్రీమన్నారాయణ, ఎలుకుర్తి హవేలీ వరంగల్
అంజలి మీడియా గ్రూప్ సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్
దీపోత్సవం కార్యక్రమం నిర్వహణాధికారి
95537 78800.