లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!
అందరి టీవీ డిజిటల్ / అల్లూరి జిల్లా వార్తలు
* చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది