కూచిపూడి కళా వైభవానికి అంకితమైన నాట్య తపస్వి ....నాట్య గురువు ముత్యాల పరమేశ్వర్ గారి సుదీర్ఘ కళా ప్రస్థానం | “కళా మాణిక్యాలు”#AndariTVDigital #KalaManikyalu #Kuchipudi #MuthyalaParameshwar

Date: 2026-09-11
news-banner
 🌺 అందరి టీవీ కళా మాణిక్యాలు 🌺
 కూచిపూడి కళకు అంకితమైన నాట్య గురువు ముత్యాల పరమేశ్వర్ గారు ...

అందరి టీవీ డిజిటల్ **హనుమకొండ:**/తెలంగాణ 
కళను నేర్చుకోవడం ఒక ప్రయాణం అయితే… నేర్చుకున్న ఆ కళను భావితరాలకు అందించడం ఒక బాధ్యత. అలాంటి బాధ్యతను స్వీకరించి, నాలుగు దశాబ్దాలకు చేరువగా కూచిపూడి కళకు సేవలందిస్తూ, అనేక మంది విద్యార్థులకు నాట్య శిక్షణ అందిస్తున్న నాట్య గురువు **ముత్యాల పరమేశ్వర్**.గారు 

విశాఖపట్నంలోని **కూచిపూడి కళాక్షేత్రంలో** కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందిన ఆయన, ప్రముఖ గురువులు **శ్రీమతి బాల కొండలరావు, శ్రీ హరి రామమూర్తి, శ్రీ శ్రీరామచంద్ర మూర్తి**ల వద్ద నాట్య విద్యను అభ్యసించారు.

డాక్టర్ వెంపటి  చినసత్యం గారి నృత్య శైలిలో కూచిపూడి కళను అభివృద్ధి చేసి, రాబోయే తరాలకు ఈ కళారూపాన్ని అందించాలనే లక్ష్యంతో ఆయన తన కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

 💃 కూచిపూడితో సుదీర్ఘ అనుబంధం

**1987 నుంచి 2002 వరకు** విశాఖపట్నంలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించిన ముత్యాల పరమేశ్వర్ గారు  **1990 నుంచి 2002 వరకు వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో** కూచిపూడి నృత్యాన్ని బోధించారు.

అదే సమయంలో **1990 నుంచి 1998 వరకు హసన్‌పర్తిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో** కూడా నృత్య శిక్షణ అందించారు.

**1989లో స్వంత కూచిపూడి నృత్య సంస్థను ప్రారంభించి**, నేటికీ తన నాట్య బోధనా ప్రయాణాన్ని కొనసాగిస్తు.అనేక మంది శిష్యులను తయారు చేసి వారి పర్యవేక్షణలో నాట్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది 

 🎭 నృత్య రూపకాలతో ప్రత్యేక గుర్తింపు

కూచిపూడి నృత్యంలో తనదైన శైలిలో అనేక నృత్య రూపకాలకు నృత్య దర్శకత్వం వహించారు.

ఆయన రూపొందించిన నృత్య రూపకాల్లో:

* గిరిజా కల్యాణం
* మోహినీ భస్మాసుర
* భక్త ప్రహ్లాద
* మత ప్రవక్తలు
* నడుస్తున్న చరిత్ర
* భారత స్వాతంత్ర్య చరిత్ర
* సంఘ సంస్కర్తలు
* అపవాది శోధనలు
* పుట్టి గ్రుడ్డివాడు
* సిలువ మార్గము
* ఒక తోట పూలు
* సమాఖ్య భారతం
వంటి పలు రూపకాలు ఉన్నాయి.

🏆 అవార్డులు… రికార్డులు

నాట్య రంగంలో ఆయన చేసిన సేవలకు పలు గుర్తింపులు లభించాయి.

**మూడు సార్లు ఉత్తమ నృత్య గురువు అవార్డు** అందుకున్న ఆయన, తన నృత్య రూపకాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు పొందారు.

అలాగే **స్టూడియో వన్, భక్తి టీవీ, దూరదర్శన్** వంటి పలు టెలివిజన్ కార్యక్రమాల్లో తన నృత్య ప్రదర్శనలను అందించారు.

**దేవ పారిజాతం అవార్డు**తో పాటు అనేక సందర్భాల్లో **ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డులు** అందుకున్నారు.

సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా దాదాపు **మూడు సార్లు గిన్నిస్ బుక్ రికార్డు** గుర్తింపును పొందారు 

అదేవిధంగా **తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్** తదితర సంస్థల నుంచి రికార్డు గుర్తింపులు పొందారు 

చారిత్రక ఓరుగల్లు గడ్డపై అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక నృత్య ప్రదర్శనకు నృత్య దర్శకుడిగా వ్యవహరించారు. ఈ ప్రదర్శనకు తనదైన శైలిలో అద్భుతంగా నృత్య రూపకల్పన చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ప్రత్యేక ప్రదర్శనకు లక్షలాది మంది నుంచి ప్రశంసలు అందగా, ఆయన కళా ప్రతిభకు కాకతీయ బుక్ అఫ్ నేషనల్ రికార్డ్  అవార్డులతో పాటు కార్యక్రమ నిర్వాహకుల నుంచి ప్రత్యేక సన్మానం కూడా లభించింది.

వారు కళామతల్లికి చేస్తున్న సేవలకు గాను 
అంజలి మీడియా గ్రూప్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతి - హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో 
అందరి టీవీ **కళా తపస్వి **అవార్డుతో సత్కరించనుంది 

🌿 కళను భావితరాలకు అందించాలనే లక్ష్యం

ముత్యాల పరమేశ్వర్ గారి కళా ప్రయాణంలో ప్రత్యేకంగా కనిపించే అంశం **కూచిపూడి కళను భావితరాలకు అందించాలనే సంకల్పం**.

తాను నేర్చుకున్న కళను తన వద్దే పరిమితం చేయకుండా, విద్యార్థులకు శిక్షణ అందిస్తూ, నృత్య రూపకాలను రూపొందిస్తూ, ప్రదర్శనల ద్వారా కూచిపూడి కళకు తన వంతు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

హనుమకొండలోని **నృత్య రవళి కళాక్షేత్రం** ద్వారా తన కళా సేవలను కొనసాగిస్తున్నారు.

 🌺 కళను నేర్చుకున్న కళాకారుడు…
🌺 కళను పంచుతున్న గురువు…
🌺 భావితరాలకు సంప్రదాయాన్ని అందిస్తున్న కళా సేవకుడు…
**ముత్యాల పరమేశ్వర్ గారి కూచిపూడి కళా ప్రస్థానం —
**
🌺 అందరి టీవీ తరఫున కళాభివందనం

కూచిపూడి కళకు మీరు అందిస్తున్న విశిష్ట సేవలకు అందరి టీవీ తరఫున హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాము.

మీరు నిరంతర కృషిశీలుడిగా ఇదే స్ఫూర్తితో కళా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

మీ పర్యవేక్షణలో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శాస్త్రీయ నృత్య కళ మరింతగా అభివృద్ధి చెంది, భావితరాలకు విస్తృతంగా అందాలని ఆకాంక్షిస్తున్నాము.

కళను కాపాడుతూ…
కళాకారులను తీర్చిదిద్దుతూ…
మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ…

ముత్యాల పరమేశ్వర్ గారి కళా ప్రస్థానం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

🌺 అందరి టీవీ – కళకు గౌరవం… కళాకారులకు గుర్తింపు.
మరో గురువు ప్రస్థానం తో మళ్ళీ కలుద్దాం ....
***************************************************************************************************************
🌺 నాట్య గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక విభాగం – శాస్త్రీయ నృత్య విభాగం ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య కళాకారులు, నాట్య గురువులు, నాట్యాలయాలు మరియు శిష్యుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.

💃 మా ప్రత్యేక కార్యక్రమాలు

🔸 శాస్త్రీయ నృత్యాంజలి
ప్రత్యేక ఎపిసోడ్లు - టీవీ ఛానల్ రియాల్టీ షో నిత్యేక షూట్ తో మరియు ఎపిసోడ్స్ లతో నగదు బహుమతులు ఉంటాయి 

🔸 శాస్త్రీయ నృత్యోత్సవం
జూనియర్ & సీనియర్ నృత్య పోటీలు 
రెండు కేటగిరిలుగా ఈ పోటీలు మొత్తం మూడు రౌండ్స్ లలో 
నిర్వహణ ఉంటుంది - నగదు బహుమతులు మరియు టైటిల్  విజేతలకు
మా సంస్థ అంబాసిడర్లు గా ప్రత్యేక షో లలో అవకాశం ఇవ్వబడును ... 

🔸 నాట్యం
ప్రత్యేక శాస్త్రీయ నృత్య ప్రదర్శన
ఈ కార్య క్రమం గురువుల నాట్యాలయాల వద్దకే వచ్చి వారి శిష్యులతో తల్లి దండ్రుల సమక్షంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం 

🔸 శాస్త్రీయ నృత్య సౌరభం
ఆన్‌లైన్ ప్రత్యేక నృత్య కార్యక్రమం
వేదికల వద్దకు రాలేని వారు ఆన్ లైన్ ద్వారా పాల్గొనే ప్రత్యేక కార్య క్రమం 
ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ...

🔸 శాస్త్రీయ మహా నృత్య నీరాజనం
రెగ్యులర్ శాస్త్రీయ నృత్య ప్రదర్శన కార్యక్రమం
శాస్త్రీయ నృత్యంలో రాణిస్తున్న నాట్యమానుల ప్రతిభకు పట్టాభిషేకం చేసేలా 
నృత్య ప్రదర్శన కార్య క్రమం 


🔸 కాకతీయ మహా నృత్య కళా వైభవం
బృంద నృత్య ప్రదర్శన – కాకతీయ కళా వారసత్వానికి ఘన నివాళి
వేలాది మంది నాట్య మణులు ఒకే చోట ఒకే కాలంలో ప్రదర్శించే నాట్య ప్రదర్శన 

ఈ కార్యక్రమాల ద్వారా నాట్య గురువులకు, నాట్యాలయాలకు మరియు శిష్యులకు ప్రదర్శన అవకాశాలు, ప్రతిభకు గుర్తింపు, ప్రత్యేక ప్రచారం మరియు కళా వేదిక కల్పించడమే మా లక్ష్యం.
పైన అన్ని కార్య క్రమాలు అందరి టీవీ ఛానల్ మరియు ప్రపంచ వ్యవతంగా అంజలి ott   ద్వారా మరియి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయబడును 
 🙏 నాట్య గురువులకు మా ఆహ్వానం

మీ నాట్యాలయంలో శిక్షణ పొందుతున్న ప్రతిభావంతులైన శిష్యులను మా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయండి.
మీ నాట్యాలయ ప్రతిభను, మీ కళా ప్రస్థానాన్ని మరియు మీ శిష్యుల ప్రతిభను అంజలి మీడియా గ్రూప్ – అందరి టీవీ డిజిటల్ & అందరి టీవీ ద్వారా మరింత మందికి పరిచయం చేయడానికి మేము ఆహ్వానిస్తున్నాము.

📞 వివరాల కోసం సంప్రదించండి:
99591 43079
**************************************************
పైన తెలిపిన కార్య క్రమాలలో ఎవరైనా మీ ప్రాంతంలో నిర్వహించడానికి 
నృత్య విభాగంలో బాధ్యతలను   తీసుకోవచ్చును - వారి నాట్యాలాయం మరియు వారికీ మా సంస్థ ద్వారా ప్రమోషన్ అందచేయబడును 
*******************************************************
🌺 అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక విభాగం
కళకు గౌరవం • కళాకారులకు గుర్తింపు • గురువులకు ప్రత్యేక గౌరవం
అంజలి మీడియా నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ 





Leave Your Comments