9వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నిక.#AndhariTV #DigitalNews #Narsampet #CongressParty #Ward9

Date: 2026-08-14
news-banner
అందరి_టీవీ_డిజిటల్_న్యూస్ నర్సంపేట: నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
నూతన కమిటీ వివరాలు
అధ్యక్షులు:
మెరుగు కిరణ్ కుమార్ యాదవ్
ఉపాధ్యక్షులు:
బల్ల కుమార్
కోట్ల రఘువీర్
గుండు నరసింహ
జనరల్ సెక్రటరీ:
పెరుమళ్ళ ప్రభాకర్ రెడ్డి
సెక్రటరీలు:
కొక్కు అశోక్
వాకిట సాధుల్లా
కార్యవర్గ సభ్యులు:
కుంటోజు సురేష్
బండారి కుమార్ స్వామి
కట్ల కళ్యాణ్
తొనగరి హరికిషన్
ముఖ్య సలహాదారులు:
బైరబోయిన వెంకటయ్య
బండి కొమురయ్య
ఎలా బోయిన ఎల్లయ్య
కొలిపాక సాంబయ్య
కడగండ్ల సదానందం
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. వార్డులో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకోబు రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పట్టణ కార్యదర్శి చిప్ప నాగ, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, గోపు మహేందర్, భుక్య గణేష్, కాటా అఖిల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments