అందరి టీవీ డిజిటల్ న్యూస్: నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నర్సంపేట పట్టణం, నర్సంపేట మండలం, దుగ్గొండి, నల్లబెల్లి మరియు ఖానాపూర్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 146 మంది లబ్ధిదారులకు గాను కోటీ 46 లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ సాయం చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు బొబ్బల రమణారెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, చెన్నూరు కిరణ్ రెడ్డి, కంకల ప్రసాద్, రఘుపతి రావు, వల్లే శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.