🍎 డీసీఎం బోల్తా.. ఆపిల్స్ కోసం ఎగబడ్డ జనం.. నిమిషాల్లోనే లోడు ఖాళీ!#AndariTVDigitalNews #Mahabubabad #Thorrur #Matedu #DCMAccident

Date: 2026-07-30
news-banner
🟥 అందరి టివి డిజిటల్ న్యూస్|
మహబూబాబాద్ జిల్లా, తోరూర్ మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలో శుక్రవారం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంతో వాహనంలో ఉన్న ఆపిల్ పండ్ల పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, రహదారిపై వెళ్తున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో చెల్లాచెదురైన ఆపిల్ పండ్లను తీసుకెళ్లేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. కొద్ది నిమిషాల్లోనే డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల లోడులో ఎక్కువ భాగాన్ని ప్రజలు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Leave Your Comments