శ్రీ భద్రకాళీ అమ్మవారిని సకుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్#AndariTVDigitalNews #BhadrakaliTemple #DasyamVinayBhaskar

Date: 2026-07-30
news-banner
అందరి టివి డిజిటల్ న్యూస్|హన్మకొండ|హనుమకొండలోని ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శాకంభరీ ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, దాస్యం వినయ్ భాస్కర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతాంగం పంటలతో సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని శ్రీ భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
శాకంభరీ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave Your Comments