వరంగల్ జిల్లా – నర్సంపేట
అందరి టీవీ డిజిటల్ న్యూస్:కాంగ్రెస్–బీజేపీ మధ్య వాగ్వివాదం.. రాజకీయంగా వేడెక్కిన వాతావరణం! కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య వాగ్వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిష్టిబొమ్మలను బీజేపీ కార్యకర్తలు దహనం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. ఈ చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలపైకి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.