వర్షం కోసం గాడిదలకు ఘనంగా పెళ్లి.. గ్రామస్తుల వినూత్న ఆచారం!#AndariTVDigitalNews#KarnatakaNews #Belagavi #Mudalagi #MunyalVillage #Rain #RainForCrops #ViralNews #TrendingNews

Date: 2026-07-22
news-banner
  • వర్షం కోసం వింత ఆచారం.. రెండు గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం!
  • గాడిదల పెళ్లికి గ్రామం మొత్తం సందడి.. వర్షాల కోసం గ్రామస్తుల ప్రత్యేక పూజలు!
  •  కర్ణాటకలో వర్షాల కోసం ఓ గ్రామంలో వినూత్న ఆచారం నిర్వహించారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకాలోని మున్యాళ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలనే ఆకాంక్షతో గ్రామస్తులు రెండు గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.

    మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

    వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని, మంచి వర్షాలు కురవాలని కోరుకుంటూ తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ప్రస్తుతం ఈ వినూత్న వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#AndariTVDigitalNews#KarnatakaNews #Belagavi #Mudalagi #MunyalVillage #Rain #RainForCrops #ViralNews #TrendingNews

    Leave Your Comments