శంషాబాద్‌లో ఇండిగో క్యాబిన్‌ క్రూపై క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యానికి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు.#AndariTV #AndariTVDigitalNews #Shamshabad #HyderabadNews #TelanganaNews #CrimeNews

Date: 2026-07-23
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ / శంషాబాద్‌ రూరల్:
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థలో క్యాబిన్‌ క్రూగా పనిచేస్తున్న ఉద్యోగినిపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలిని ప్రతిరోజూ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లే క్యాబ్‌ డ్రైవర్‌ ప్రశాంత్‌కుమార్‌.. ఈ నెల 20న మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారి బంద్‌ ఉందని చెప్పి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడగా, బాధితురాలు ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రశాంత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave Your Comments