అందరి టీవీ డిజిటల్ న్యూస్ (Andhari TV Digital News)
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఉపాధ్యాయురాలు అకాల మరణం!
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి జడ్పీ హైస్కూల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలిగా (స్కూల్ అసిస్టెంట్) సేవలందిస్తున్న వజ్రకుమారి (45) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు.
గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వజ్రకుమారి అకాల మరణం పట్ల విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని ప్రకటించారు.