అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి / నర్సంపేట
ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ కి నర్సంపేట పట్టణానికి చెందిన
విజ్ డమ్ హై స్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎం. అన్వేష్ ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విద్యార్థి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 571 మార్కులు సాధించడమే గాక, ఎన్సీసీలో జిల్లా ఉత్తమ క్యాడెట్ అవార్డు మరియు జాతీయస్థాయి క్రీడల్లో రాణించడం విశేషం. అన్వేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావడం తన లక్ష్యమని తన లక్ష్యసాధనకు నిరంతరం పాటుపడతానని, తనను నిరంతరం ప్రోత్సహించిన ఉపాధ్యాయ సిబ్బందికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. విద్యార్థినీ, విద్యార్థులు బాల్య దశ నుండే క్రమశిక్షణను కలిగి, ఏ రోజు పాఠ్యాంశాలను ఆరోజే పూర్తి చేసి, ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గమ్య సాధనకు నిరంతరం శ్రమించాలని పాఠశాల డైరెక్టర్ జావేద్ గారు తెలిపారు. ట్రిపుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థి అన్వేష్ ను పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, వీరభద్రయ్య, రఘుపతి రెడ్డి, రవీందర్, శివరాజ్, రాము, ఇలియాస్, కుమారస్వామి, సుమన్, రియాజ్ లతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.