వరల్డ్ పైల్స్ డే రోజున టీజీఎంసీ బృందానికి చిక్కిన నకిలీ పైల్స్ వైద్యులు

Date: 2024-11-21
news-banner
👉వరల్డ్ పైల్స్ డే రోజున హన్మకొండ లో నకిలీ పైల్స్ డాక్టర్స్ పై తనిఖీ చేసిన టీజీఎంసీ అధికారులు 

👉 టీజీఎంసీ అధికారి డా నరేష్ కుమార్,  ఐ ఎం ఎ ప్రెసిడెంట్ డా అన్వార్ మియా ఆధ్వర్యంలో  పైల్స్  చికిత్స అందించే నకిలీ వైద్యులపై స్టింగ్ ఆపరేషన్ 

👉నకిలీ పైల్స్ వైద్యుల మోసాలని  స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగు లోకి తెచ్చి బట్ట బయలు చేసిన వరంగల్ టీజీఎంసీ,ఐ ఎం ఎ వైద్యులు 

👉 కోల్ కత్తా  నుండి వచ్చి స్థిర పడ్డ  నకిలీ వైద్యులు డా బిశ్వాస్  అని పేర్కొంటూ పైల్స్ లేకున్నా ఉన్నాయి అంటూ చికిత్స 

👉ఇతర రాష్ట్రాల్లో  బి ఎ ఎం స్ చదివినట్టు నకిలీ డిగ్రీలు 

👉తెలంగాణ ఆయుష్ కౌన్సిల్,  డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ / జిల్లా ఆరోగ్య, వైద్యధికారుల నుండి అనుమతి లేకుండానే చికిత్స కేంద్రాల ఏర్పాటు , నిర్వహణ 

👉ఆయుర్వేదిక్ చికిత్స పేరుతో పిండి, పేస్ట్, ఉప్పు కలిపి క్రీమ్స్ తో చికిత్స చేస్తూ నిలువు దోపిడీ లు. 

👉పేరుకే ఆయుర్వేదం అని బోర్డు కాని పలురకాల ఆంటిబయోటిక్స్,  నొప్పి నివారణ  అల్లోపతి మందులు లభ్యం 

👉జబ్బు లేకున్నా  పైల్స్  ఉన్నాయి అని చెప్పి చికిత్స పేరు మీద  దశల వారీగా 16-20వేల వరకు వసూళ్లు 

👉 జిల్లా వైధ్యాధికారికీ,  ఆయుష్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయనున్న తెలంగాణ వైద్య మండలి.

అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి 
నకిలీ వైద్యుల భరతం పట్టడానికి   తెలంగాణ వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ ఆరోగ్యం పరంగా ఎటువంటి సమస్య లేని తన డ్రైవర్ ని  పేషెంట్ లాగా హన్మకొండ  హనుమాన్ గుడి  వద్ద ఉన్న  మారుతీ క్లినిక్ / ఫస్ట్ ఎయిడ్ పేరుతో నిర్వహిస్తున్న RK బిశ్వాస్ (నకిలీ వైద్యుడు ) వద్దకి మలం లో రక్తం పడుతుంది, నొప్పి ఉంది అని పంపించగా పరీక్షించిన నకిలీ వైద్యుడు రాకేష్ బిశ్వాస్  పేషెంట్ కి పైల్స్ సమస్య ఉందని దశల వారీగా చికిత్స అందించాలని  సుమారుగా ఖర్చు 20వేల వరకు అవుతుందని తెలియ చేసాడు,  పక్కనే ఉన్న టీజీఎంసీ అధికారి డా నరేష్ కుమార్ వరంగల్ ఆంటీ క్వాకరీ బృందం సభ్యులు,  ఐ ఎం ఎ అధ్యక్షులు డా అన్వార్ మియా, డా శిరీష్,  ప్రముఖ సర్జన్ డా కూరపాటి రమేష్ లతో కూడిన బృందం అక్కడికి చేరుకోగా భయపడిన సదరు నకిలీ వైద్యుడు  మాట మార్చి నేను పరీక్షించి ఏమి చెయ్యాలో చెప్తా అని కానీ  ఖమ్మం నుండి మరో వైద్యుడు చికిత్స చేయడానికి వస్తాడని  అతనితో ఫోన్ లో మాట్లాడించాడు,  ఫోన్ లో మాట్లాడిన సదరు ఖమ్మం వైద్యుడు సైతం ఆర్ట్స్ లో డిగ్రీ చేసిన నకిలీ వైద్యుడి గా గుర్తించారు.

హనుమాన్ గుడివద్ద ఉన్న మరో  చికిత్సకేంద్రంలోను అనుపమక్లినిక్ పేరుతో నిర్వహిస్తున్న  పైల్స్ సెంటర్ లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతి లేకుండా ఆయుర్వేదిక్ వైద్యుడు   
ఎ కె సర్కార్ పేరు మీద నాచురోపతి మరియు యునాని చదివిన ఎస్ కె సర్కార్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్టు మరియు ఇద్దరికీ రాష్ట్ర ఆయుష్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేదు అని గుర్తించారు.

కుమార్ పల్లి లోని నకిలీ ఆయుర్వేదిక్ వైద్యుడు భిశ్వస్  ఆయుర్వేద డిగ్రీ కోల్ కత్తా లో చదివినట్టుగా నకిలీ సర్టిఫికెట్స్ చూపించి తెలంగాణ  ఆయుష్ కౌన్సిల్,  డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటి లో అనుమతి లేకుండా  సొంతంగా ఆశాస్త్రియ పద్ధతుల్లో తయారు చేసిన పేరు లేని,  అనుమతిలేని లేపనాలు వాడుతూ ఎంతో మంది రోగులకు చెప్పుకోలేని బాధలు మిగిల్చేల చికిత్స చేస్తున్నట్లు గుర్తించామని,  అతడి భాధితులలో కొందరు ప్రముఖ ఉద్యోగులు కూడ ఉన్నారని ఐ ఎం ఎ జిల్లా అధ్యక్షులు డా అన్వార్ మియా తెలియ చేసారు.

ఈ ముగ్గురు నకిలీ వైద్యుల పైన  జిల్లా వైద్యధికారులకు మరియు ఆయుష్ కౌన్సిల్  కి ఫిర్యాదు చేయనున్నామని అలాగే  మారుతీ క్లినిక్ నిర్వాహకుడు రాకేష్ బిశ్వాస్,  శ్రీలక్మి క్లినిక్ నిర్వహకుడు బిశ్వాస్ లపై NMC 34,54 ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు  వరంగల్ జిల్లా ఆంటీ క్వాకరీ అసోసియేట్ సభ్యుడు డా శిరీష్ తెలియ చేసారు 

ప్రజలు కూడా నకిలీ వైద్యుల వద్దకి ఆపరేషన్ లేకుండా గ్యారంటీ చికిత్స అంటూ కర పత్రాల ద్వారా,  గోడల మీద వ్రాతలతో ప్రకటన లు గుడ్డి గా నమ్మి మోసపోవద్దని   వారి వద్దకి  వచ్చే ప్రతి పేషెంట్ కి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండా పైల్స్, ఫిస్టుల ఉన్నాయని నమ్మిస్తున్నారని,  వారికి చికిత్స అందించే అర్హత లేదని,  వారు అందించే గుర్తింపులేని చికిత్స ల  వలన మలద్వారం మూసుకుపోవడం,  చీము పట్టడం,  మలం శాశ్వతంగా తెలియకుండా   పడిపోయే సమస్య లు వస్తాయని   మరియు ఇటువంటి సమస్యలు చాలా మంది బయటకు చెప్పుకోలేక మానసిక క్షోభ కి గురి అయి కుంగుబాటుకు గురి అవుతారు అని తెలంగాణ వైద్య మండలి పౌర సంబంధాల చైర్మన్ డా నరేష్ కుమార్ తెలియ చేసారు.

వరంగల్ నగరం కరీమాబాద్ ప్రాంతం లో  జరిగిన మరో బృందం తనిఖీలలో  డా శేషు మాధవ్,  డా సుదీప్,  డా శివ్వా సృజన్,  డా దిలీప్ లు పాల్గొన్నారు.  
తనిఖీ లలో జిల్లా అధికారుల అనుమతి లేకుండా అశ్విని క్లినిక్   నిర్వహిస్తున్నట్లు గుర్తించారు,  నిర్వాహకుడు డా దిలీప్ కుమార్, MBBS కు నోటీసు ఇవ్వడంతోపాటు, జిల్లావైధ్యాధిధికారికి ఫిర్యాదు ఇవ్వనున్నట్లు టీజీఎంసీ సభ్యుడు డా శేషు మాధవ్ తెలియ చేసారు.
image

Leave Your Comments