నర్సంపేట మార్పుకు ఎమ్మెల్యే దొంతి శ్రీకారం | తోడైన సమర్ధవంతమైన ఇద్దరు అధికారులు | గ్రీన్ మార్ట్ మెట్లు తొలగింపు ....| AndariTv Digital ,Narsampeta,Warangal District News

Date: 2025-08-08
news-banner
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
సమర్ధవంతమైన నాయకుడు మరియు బాధ్యత కలిగిన అధికారులు ఉంటె మార్పు ఎలా ఉంటుందో నర్సంపేటలో నూతనంగా చేపట్టిన మార్పులు చూస్తే తెలిసిపోతుంది 
నర్సంపేట పట్టణ రూపు రేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి 
వారి ఆలోచనలకూ అనుకూలంగా మార్పు కోసం తపించే అధికారులు తోడైతే ఇంకేముంది 
పట్టణంలో మార్పు మొదలైంది 
సంవత్సరాలుగా పాలకులు ,అధికారులు మారుతున్న కూడా ఫుట్ పాత్ ల ఆక్రమణ ,రోడ్డు పై ఇష్టానుసారంగా హోర్డింగ్ లు,మెట్లు ,
కబ్జా లతో తరచు ప్రమాదాల బారిన ప్రజలు పడుతుండడం భారీగా వాహనాలు పెరిగినా కూడా గత పాలకులెవరూ పట్టించుకోలేదు 
అందరి టీవీ ఎన్నో కథనాలను ప్రసారం చేసింది అధికారులను కలిసింది 
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప చర్యలు శూన్యం 
కానీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి ఇట్టి సమస్యలు తీసుకుపోవడం తో మార్పుకు శ్రీకారం చుట్టారు ,నర్సంపేట మున్సిపాలిటీ కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ కు  సైతం పట్టణంలోని ప్రధాన సమస్యలు వివరించగా తాను కూడా ముందుకు సాగాడు 
ఫుట్ పాత్ ల ఆక్రమణ ,రోడ్డు పై వరకు వెలసిన షెడ్లు ,మెట్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేశాడు ,తొలగింపు చర్యలు చేపడుతుండగా కొందరు తిరుగబడుతుండగా 
మార్పు లో నేను సైతం అంటూ పట్టణ సి ఐ రఘుపతి రంగ ప్రవేశం చేసి తిరుగబడిన వారిని  శాంతిప చేస్తూ 
కమీషనర్ కు సిబ్బందికి అండగా నిలిచి విజయం సాధించారు 
ఎన్నో ఏళ్లుగా పాలకుల చేతకాని తనం తో పాటు కొందరిస్వార్ధం కారణంగానే 
పట్టణం లో మార్పులు జరుగలేదు అనేది నిజం అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు 
ఈ మార్పులో భాగం గా కొందరు చిరు వ్యాపారాలు ,కూరగాయలు ,పండ్లు అమ్ముకునేవారు ఇబ్బందులు పడుతుండడంతో 
వారికీ శాశ్వత పరిష్కారం చూపెడుతామని ఎమ్మెల్యే మరియు కమీషనర్ లు హామీ ఇచ్చారని వ్యాపారులు తెలుపుతున్నారు 
వరంగల్ రోడ్ కూడలి లో తరచు ప్రమాదాలకు గురవుతున్నాయని అందరి టీవీ వరుస కథనాలు మరియు మరో పత్రిక ఆంధ్రప్రభ వార్తకు స్పందించిన అధికారులు ఈ రోజు గ్రీన్ మార్ట్ మెట్లు మరియు అక్షర స్కూల్ ముందు భాగంతో పాటు మరిన్ని నిర్మాణాలు తొలగించారు 
కొందరు ఈ తొలగింపును అడ్డుకోవాలని చూసినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ,కమీషనర్ అందరి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే అనుకున్న మార్పుకు కృషి చేస్తున్నారు ,ఇప్పటి వరకు ఎందరో వచ్చారు పోయారు కానీ కమీషనర్ భాస్కర్ తీసుకున్న నిర్ణయానికి అందరి టీవీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది 
మొత్తానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి నూతన మార్పు కై  ఆలోచనలకు అధికారులు కమీషనర్ భాస్కర్ ,సి ఐ రఘుపతి ఇద్దరు తోడవ్వడంతో పట్టణం నూతనంగా కనబడుతుంది 
మరో వారం రోజుల్లో మొత్తం పూర్తవుతాయని కమీషనర్ అందరి టీవీ కి తెలిపారు 
ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తున్నామని కావున అందరు సహకరించాలని కోరుతున్నట్లు అందరి టీవీ కి పట్టణ సి ఐ రఘుపతి తెలుపగా 
నర్సంపేట పట్టణంలో మార్పుకు శ్రీఅక్రం చుట్టిన ఎంల దొంతికి ప్రజలు జె జె లు కొడుతున్నారు 
నర్సంపేట నూతన మార్పు పై అందరి టీవీ లో ప్రత్యేకంగా చూడండి 
image

Leave Your Comments