అందరి టీవీ డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రత్యేకం
ధనార్జనే ద్యేయంగా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తుంటే
మరో పక్క నూతన బ్రాంచిల పేరుతో అనుమతులు లేకుండానే పాటశాలలు ఏర్పాటు చేసి
పేర్ల చివర తోకలు తలిగించి మరీ విద్యార్థుల తల్లి దండ్రుల వద్దనుండి ఫీజుల రూపంలో అధిక సొమ్ము దోచుకుంటున్నారు
తాజాగా నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ ,అయ్యప్ప దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తుంది
ఎలాంటి అనుమతులు లేకున్నా పాఠశాలలో అడ్మిషన్ లు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయంలో పడేస్తున్నారు
పాఠశాల కు అనుమతులు ఉన్నాయా అనే అంశం పై నర్సంపేట మండల విద్యాశాఖ అధికారిని
సంప్రదించగా వారికీ ఎలాంటి అనుమతులు లేవని తీసుకుంటారని తెలుపడం ఆశ్యర్యానికి గురి చేసింది
అనుమతులు లేకుండా ప్రధాన రహదారి పై పాఠశాల నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోరా అని అని అడిగితే నోటీసులు ఇచ్చామని తెలుపడం కోసమెరుపు
అంటే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా
చర్యలుండవా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
( అనుమతులు లేని పాఠశాలకు ఎవరు వెళ్ళవద్దు ) అందరి టీవీ ప్రత్యేక కార్యక్రమంలో