అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి
తేదీ 25-09-2024 న తెలంగాణా వైద్య మండలి అధికారులు , వరంగల్ ఆంటీ క్వాకరీ బృందం సభ్యులు, IMA, HRDA జిల్లా సభ్యులు డా వి. నరేష్ కుమార్ , డా వద్దిరాజు రాకేష్, డా అన్వర్ మియా, డా కె.వెంకట స్వామి, డా అజిత్ పాషా లు హన్మకొండ లో భీమారం, దీన్ దయాళ్ కాలనీ, వరంగల్ లోని రామన్నపేట ప్రాంతాల్లో నకిలీ వైద్యులు / RMP/ PMP సెంటర్ లపై తనిఖీలు నిర్వహించారు.
భీమారం ఇందిరా గాంధీ విగ్రహం వెనకాల శ్రీ కళ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు నకిలీ వైద్యుడు గొర్రె నరేష్, రాజ్ హోటల్ దగ్గర దీన్ దయాళ్ నగర్ అభిరామ్ క్లినిక్ నిర్వాహకుడు నకిలీ వైద్యుడు ఇసంపల్లి మహేందర్, జనరల్ నర్సింగ్ చదివి వైద్యుడి వలె క్లినిక్, బోర్డు ఏర్పాటు చేసి అధిక మొతాదులో ఎలాంటి శాస్త్రీయత, కొలబద్దత ఆంటిబయోటిక్, స్టేరోయిడ్స్ ఇస్తునట్టు టీజీఎంసీ అధికారులు డా నరేష్ కుమార్ గుర్తించి వందల సంఖ్యలో స్టేరోయిడ్స్, ఆంటిబయోటిక్, నొప్పి నివారణ ఇంజక్షన్స్ స్వాదీనం చేసుకొని తగు ఆధారాలు సేకరించారు.
రామన్నపేట లోని నకిలీ వైద్యుడు / RMP బి. జ్ఞానేశ్వర్, ANM చదివి డాక్టరు వలె స్టేరోయిడ్స్, నొప్పి నివారణ ఇంజెక్షన్స్, ఆంటిబయోటిక్ ఇంజెక్షన్స్, సెలైన్ బాటిల్స్ ఇస్తునట్టు గుర్తించి ఆధారాలు సేకరించి కౌన్సిల్ కి పంపించారు.
ఈ ముగ్గురు నకిలీ వైద్యుల పైన NMC 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనునన్నట్లు టీజీఎంసీ అధికారి, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా వి.నరేష్ కుమార్ తెలియ చేశారు.
కొందరు క్వాలిఫైడ్ వైద్యులు, హాస్పిటల్స్ వారు కూడా నకిలీ వైద్యుల వద్దకి PRO లను పంపిస్తు రిఫరల్ పాడ్స్ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని లేనిచో నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న క్వాలిఫైడ్ వైద్యుల పైన కూడా చర్యలు తీస్కుంటానికి వెనుకాడ బొమని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ హెచ్చరించారు.
వరంగల్ ఆంటీ క్వాకరీ బృందం సభ్యులు, IMA ప్రెసిడెంట్ డా అన్వర్ మియా మాట్లాడుతూ RMP / PMP లు అసలు అర్హతకి మించి చట్టవ్యతిరేకంగా వైద్యం చేస్తున్నారని, వైద్య పరంగా వారికి ఎటువంటి అర్హత లేదని , RMP/ PMP లు ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
వరంగల్ HRDA జిల్లా అధ్యక్షులు, వరంగల్ జిల్లా ima ఉపాధ్యక్షులు డా కె. వెంకటస్వామి RMP / PMP వ్యవస్థ చట్ట వ్యతిరేకం అని గతంలో HRDA కోర్టు లో కేసు వేయగా వీరికి ట్రైనింగ్ కోసం గత ప్రభుత్వ్వాలు ఇచ్చిన జి.ఓ లు, చట్ట వ్యతిరేకం అని హై కోర్టు కొట్టివేసిందని, అర్హతకి మించి వైద్యం చేసే ప్రతి నకిలీ వైద్యుడి పైన NMC చట్ట ప్రకారం చర్యలు తీస్కుంటామని తెలియ చేశారు.
పారా మెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ చేసుకొని వైద్యులు కాకున్నా కూడా వైద్యుల వలె ఫరిది దాటి వైద్యం అందిస్తున్న మహేందర్, జ్ఞానేశ్వర్ ల పేర్లు పారా మెడికల్ బోర్డు నుంచి తొలగించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని పారా మెడికల్ బోర్డు కు సైతం సిఫార్సు చేయనున్నాట్లు టీజీఎంసీ కో ఆప్ట్ సభ్యులు, వరంగల్ ima వైస్ ప్రెసిడెంట్ డా అజిత్ పాషా తెలియ చేశారు.
THANA రాష్ట మాజీ అధ్యక్షులు డా వద్దిరాజు రాకేష్ నకిలీ వైద్యులు తెలిసి తెలియక ఇచ్చే వైద్యం వలన ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, ధీర్ఘ కాళిక వ్యాదులు తొలి దశలోనే సంభవిస్తాయని ప్రజలు కూడా క్వాలిఫైడ్ వైద్యుల వద్ద నాణ్యమైనచికిత్స పొంది ఆరోగ్యంకాపాడుకోవాలని తెలియ చేశారు.