అందరి టీవీ డిజిటల్ / నర్సంపేట ,వరంగల్ జిల్లా ప్రతినిధి
నర్సంపేట మెడికల్ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పస్తామంటూ నవోదయ ఏజన్సీ పేరు మీద
డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను నర్సంపేట సి ఐ రమణమూర్తి నేతృత్వంలో చాక చక్యంగా పట్టుకున్నారు
నవోదయ ఎజన్సీ నిర్వాహకురాలు పిండి స్వప్నపిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగం లోకి దిగిన పోలీసులు
ఈ రోజు ముగ్గురుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు
అరెస్ట్ వివరాలను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నవోదయ ఏజన్సీ పేరు పై
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశావాహులనూ మోసం చేస్తున్నారని మాకు పిర్యాదు రావడంతో
ఈ ముగ్గురుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 17 మంది వద్ద నుండి వసూలు చేసిన
7,35,000/- నగదు, 3 మొబైల్ ఫోన్ లు, టాటా విస్టా కార్.ను స్వాధీనపరచుకున్నామని తెలిపారు
ఎవరు కూడా ఇలాంటి వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు
అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు
A1: పోరండ్ల శివ @ శివ శంకర్ S/o రాజేందర్, వయస్సు: 35 సంవత్సరాలు, కులం: పద్మశాలి, వృతి: వ్యాపారం, R/o పద్మశాలి కాలనీ, పరకాల, వరంగల్.
A2: దరావత్ శరత్ చంద్ర S/o రామ, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: లంబాడ, వృతి: కూలీ, R/o ఇప్పల్ తండ, నర్సంపేట మండలo.
A3: MD. ఖాజా మొయినుద్దీన్ S/o ముస్తఫ్ఫా, వయస్సు: 46 సంవత్సరాలు, కులం: ముస్లిం, వృతి: శ్రీ సాయి కోస్టల్ మాన్ పవర్ సప్లయర్ ఏజెన్సీ, R/o గవిచెర్ల గ్రామం, సంగెం మండలం , వరంగల్.
పరారిలో ఉన్న నిందితురాలు: అకినపెల్లి కవిత, R/o దేశాయిపేట, వరంగల్
ఇట్టి కేసును వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ips DCP ఈస్ట్ జోన్ ఫై రవీందర్ గారి సూచనలతో, ACP నర్సంపేట్ వి కిరణ్ కుమార్ గారి పర్యవేక్షణలో, నాలుగు రోజులలోనే కేసును చేదించి నిందితులను అరెస్ట్ చేసిన నర్సంపేట ఇన్స్పెక్టర్ D.రమణ మూర్తి మరియు సిబ్బంది ని CP అబినందించారు