వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు.. ఈ ఒక్కరోజు మాత్రం కుండపోత.. ఈ జిల్లాల ప్రజలు కాస్త జాగ్రత్త! | AndariTV Digital News | Telangana | Rain Effect

Date: 2025-06-16
news-banner

అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం తెలిపింది. అయితే ఇవాళ (జూన్ 15) ఒక్కరోజు మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కు వైపు వ్యాప్తిస్తోంది. మరో ఉపరితల ఆవర్తనం ఇవాళ (జూన్ 15) వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

దీంతో ఇవాళ (జూన్ 15) రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు పచ్చిమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి , వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఈరోజు తెలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉంది.

హైదరాబాద్లో...

ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో అక్కడక్కడ జోరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

రేపటి (జూన్ 16) నుంచి రాష్ట్రంలో వర్ష తీవ్రత తగ్గుతుందని.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
image

Leave Your Comments