వరంగల్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరిస్తాం. -గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు / Warangal Press Club / AndariTv Digital News

Date: 2025-05-23
news-banner
అందరి టీవీ డిజిటల్ వార్తలు / హనుమకొండ జిల్లా ప్రతినిధి 
వరంగల్ నగరంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటుకోసం ఏర్పడ్డ అడ్ హక్ కమిటీ సభ్యులు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారితో సమావేశమయ్యారు. 
వరంగల్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయటానికి పూనుకున్నామని, మాకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి సహాయ, సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు. అన్ని విషయాలను సావధానంగా చర్చించారు. నూతన క్లబ్ కు ఏ రకమైన సహాకారం అందించాలో తెలియజేయాలని అడ్ హక్ కమిటీ బాధ్యులను కోరగా, అందరు బాధ్యులతో చర్చించి మల్లీ తెలియపరుస్తామని అన్నారు. 
వరంగల్ అడ్ హక్ బాధ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసిన తర్వాత తాము యూనియన్ల నేతలు, తమ కమిటీతో చర్చించిన అనంతరం తుదినిర్ణయాన్ని ప్రకటిస్తామని అధ్యక్షుడు వేముల నాగరాజు వారికి తెలియజేశారు.
సమావేశంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, అడ్ హక్ కమిటీ ప్రతినిధులు సంగోజు రవి, కోరుకొప్పుల నరెందర్, మట్ట దుర్గాప్రసాద్, జన్ను స్వామి, జక్కుల విజయ్ కుమార్, వలిశెట్టి సుధాకర్, 
బాలవారి విజయ్ రాజ్ పాల్గొన్నారు.
image

Leave Your Comments