వరంగల్ నగరం కరిమాబాద్ లో నకిలీ వైద్యుడి గుట్టు రట్టు / BreakingNews / AndariTv Digital

Date: 2025-01-07
news-banner
👉 జనరల్ ప్రాక్టీషనర్ అని పేర్కొంటూ ప్రెస్క్రిప్షన్స్ రాస్తున్న నకిలీ వైద్యుడు ఎ.దిలీప్ 

👉  వరంగల్  జిల్లా టీజీఎంసీ ,ఐ ఎం ఎ,  మరియు డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో సంయుక్త తనిఖీలు 

👉నకిలీ వైద్యుడు ఫిజియోథెరపిస్ట్  ఎ.దిలీప్ పై ఎన్ ఎం సి, టి ఎస్ ఎం పి ఆర్ చట్టం,  డ్రగ్, కాస్మెటిక్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయనున్న టీజీఎంసీ,  డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు

👉 ఫిజియో థెరపిస్ట్  ఎ.దిలీప్ పైన పారా మెడికల్ బోర్డు కి సైతం ఫిర్యాదు చేయనున్న  తెలంగాణ వైద్య మండలి.
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
వరంగల్ నగరం కరిమాబాద్ లో 06-01-2025 సోమవారం సాయంత్రం వరంగల్ జిల్లా మెడికల్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది .

వరంగల్ కి చెందిన ఎ. దిలీప్ ఫిజియోథెరపీ  చదివి తాను డాక్టరు మరియు జనరల్ ప్రాక్టీషనర్ అని పేర్కొంటూ  చట్ట విరుద్ధంగా ఆధునిక  వైద్యం ప్రాక్టీస్ చేయడంతో పాటు ఔషద నియంత్రణ చట్ట వ్యతిరేకం గా సుమారు 3000rs   విలువ గల మందులు నిల్వ అక్రమంగా ఉంచినట్లుగా  వరంగల్ మెడికల్  టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది.

సదరు  ఫిజియో థెరపిస్ట్  ఎ.దిలీప్  ప్రభుత్వ అనుమతి లేకుండా క్లినిక్ ఏర్పాటు చేసి ఆశాస్త్రియంగా అధిక మోతాదు ఆంటిబయోటిక్ , స్టేరాయిడ్,  నొప్పి నివారణ ఇంజెక్షన్స్  రోగులకు ఇస్తునట్టు మరియు తాను డాక్టరు అని పేర్కొంటూ ప్రెస్క్రిప్షన్ రాస్తునట్లు  అధికారులు తగు ఆధారాలు సేకరించి  NMC చట్టం 34,54 ప్రకారం కేసు నమోదు చేయనున్నట్టు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ తెలియ చేశారు.

ఔషద నియంత్రణ అధికారుల అనుమతి లేకుండా  సుమారు 3000 రూపాయలు విలువ మందులు అక్రమంగా నిల్వ ఉంచినదుకు గాను డ్రగ్స్ & కాస్మెటిక్ చట్టం (1940 )సెక్షన్ 18సి ప్రకారంకేసు నమోదు చేయనున్నట్లు వరంగల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ తెలియ చేశారు.

ఫిజియో థెరపీ  చదివిన వారు అసలు డాక్టర్స్ కాదని వారు  డాక్టర్ అని బోర్డు పెట్టొద్దని,  ఆధునిక వైద్యం చేసే అర్హత కాని, అనుమతి కాని  వారికి లేదని  మరియు వారు ఎటువంటి అల్లోపతి మందులు  రాయడం కాని,  ఇంజెక్షన్స్  కాని ఇవ్వకూడదని, వారు చేసే ఫిజియో థెరపి ప్రాక్టీస్ కూడా జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల నుండి అనుమతి తీసుకోవాలని డా నరేష్ కుమార్ తెలియ చేశారు.

మెడికల్ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలో  టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్,  జిల్లా ఔషద నియంత్రణ అధికారి అరవింద్ కుమార్,  ఐ ఎం ఎ రాష్ట్ర  ఆంటీ క్వాకరీ చైర్మన్ డా అశోక్ రెడ్డి, 
వరంగల్ జిల్లా ఐ ఎం ఎ కోశాధికారి డా శిరీష్ లు పాల్గొన్నారు.

image

Leave Your Comments