స్వేరో ఆర్గనైజేషన్.. ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన దాస్యం వినయ్ భాస్కర్/#AndariTV #AndariTVDigital #Swaero #SwaeroOrganisation #SwaeroAtmeeyaSammelan #DasyamVinayBhaskar #Hanumakonda #KalojiKalakshetram #TelanganaNews #Education #SocialAwareness

Date: 2026-11-10
news-banner

అందరి టీవీ డిజిటల్

హనుమకొండ జిల్లా ప్రతినిధి;విలువలు విజయాలకు ప్రతీకగా స్వేరో ఆర్గనైజేషన్ పనిచేస్తోందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

స్వేరో ఆత్మీయ సమ్మేళనం కన్వీనర్ మంద శ్యామ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వద్ద మంగళవారం స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ శ్రేణులు, స్వేరో సభ్యులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం కల్పించారని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు.

పూర్ణ, ఆనంద్ వంటి విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగా, వేలాది మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని వివరించారు.

కేసీఆర్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అప్పటి గురుకులాల కార్యదర్శి, నీతి నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో ఆర్గనైజేషన్‌ను స్థాపించి సమాజంలో విద్య, సామాజిక చైతన్యం, విలువల పెంపునకు కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వేరో సభ్యులకు, నిర్వాహకులకు పిలుపునిచ్చారు.

హనుమకొండలో నిర్వహించిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్వేరో సభ్యులు పాల్గొన్నారు.

ఇలాంటి మరిన్ని తాజా వార్తలు, జిల్లా స్థాయి విశేషాలు, ప్రజా సమస్యలు మరియు సామాజిక కార్యక్రమాల సమాచారం కోసం చూస్తూనే ఉండండి..

అందరి టీవీ డిజిటల్ – ప్రజల గొంతుక.. ప్రజల కోసం!

Leave Your Comments