అందరి టీవీ డిజిటల్ న్యూస్ |నర్సంపేట / రాజుపేట:
మండల పరిధిలోని రాజుపేట గ్రామంలో అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ శ్రీమతి ఎం. సరస్వతి అరటి పండ్లను అందజేశారు. దీక్షాపరులైన అయ్యప్ప భక్తులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎం సరస్వతి మాట్లాడుతూ.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల కోసం నర్సంపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ఆర్టీసీ లక్ష్యమని పేర్కొన్నారు. భక్తులు, గురుస్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముందస్తు బుకింగ్ & సమాచారం కోసం:
9959226052
7382856034
9704644543
రిపోర్ట్: కామిశెట్టి రంజిత్ కుమార్ పటేల్, కరస్పాండెంట్, అందరి టీవీ.