వెయ్యి స్తంభాల దేవాలయంలో ఘనంగా శ్రావణ మాస మహా అన్నదాన మహోత్సవం.#AndariTVDigitalNews #ShravanaMasam #MahaAnnadanam #KushalFoundation

Date: 2026-08-18
news-banner
అందరి టివి డిజిటల్ న్యూస్: వరంగల్: శ్రావణ మాసం సందర్భంగా వెయ్యి స్తంభాల దేవాలయంలో నిర్వహించిన మహా అన్నదాన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కుషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, చైర్మన్ శ్రీ కుషల్ మామిడాల  నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సేవా కార్యక్రమాన్ని కుషల్ ఫౌండేషన్ గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. అంతకుముందు వారి తండ్రిగారు, తాతగారు కలిసి సుమారు 30 సంవత్సరాలుగా ఈ మహోన్నత సేవను కొనసాగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవలకు గుర్తింపుగా ఈ సంవత్సరం వారికి “మహాపురుష్ అవార్డు” లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.
కార్యక్రమానికి ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ అనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణలో శ్రీ మామిడాల గణపతి, శ్రీమతి మీనా కుమారి, ఈవెంట్ & సోషల్ మీడియా మేనేజర్ సంజయ్ (Telugu Creator) తదితరులు పాల్గొన్నారు.
శ్రావణ మాసంలో నిర్వహించిన ఈ మహా అన్నదాన కార్యక్రమం ద్వారా సేవా భావాన్ని చాటడంతో పాటు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave Your Comments