అందరి టివి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ జిల్లా నర్సంపేట డిపో నుంచి ఆగస్టు 15న ఉదయం 5 గంటలకు 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుతో ప్రత్యేక గోవా టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.
హైదరాబాద్ నుంచి హంపి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ధర్మస్థల, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ తదితర ప్రాంతాల్లో దైవదర్శనాల అనంతరం గోవాకు ప్రయాణం సాగుతుంది. గోవాలో ఒక రోజు పర్యటన అనంతరం ఆగస్టు 20వ తేదీ గురువారం రాత్రి 12 గంటల వరకు నర్సంపేటకు చేరుకుంటుంది.
💰 ప్రయాణ చార్జీ: ఒక్కరికి ₹5,500
🗓️ యాత్ర: 5 రోజులు
🍱 భోజనం, వసతి గదుల ఖర్చులు పర్యాటకులే భరించాలి.
📞 ముందస్తు బుకింగ్ కోసం: 9704644543
ఈ సదావకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ఎం. సరస్వతి కోరారు.