ప్రతీ సభ్యుడి సంక్షేమమే గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ధ్యేయం.#AndharitvDigital#Pressclub#Greaterwarangal#

Date: 2026-08-12
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో సభ్యుల సంక్షేమమే తమ కమిటీ ప్రధాన ధ్యేయమని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ప్రమాదవశాత్తూ మృతిచెందిన క్లబ్ సభ్యుడు, దివంగత డెస్క్ జర్నలిస్ట్ రబ్బానిపాషా కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ.10.57 లక్షల బీమా చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేముల నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌తో పాటు టీయూడబ్ల్యూజే-ఐజేయూ యూనియన్‌కు దక్కుతుందని అన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు చేపట్టిన బీమా పథకం ఒక కుటుంబానికి ఆసరాగా నిలవడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.
గత ఏడాది క్లబ్ సభ్యులకు చేయించిన బీమాను ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయించాలని తమ కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం బీమా రెన్యూవల్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
అనంతరం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ కమిటీ, యూనియన్ బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులతో కలిసి దివంగత జర్నలిస్ట్ రబ్బానిపాషా కుటుంబ సభ్యులకు రూ.10.57 లక్షల బీమా చెక్కును అందజేశారు. రబ్బానిపాషా కుటుంబానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి బీమా పాలసీని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొళ్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం కుమార్, బొడిగె శ్రీను, అల్లం రాజేష్ వర్మ, యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు సంపేట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, పోడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ సభ్యులు వీరగోని హరీష్, జనగాని ఆంజనేయులు, ఎండి నయీంపాషా, కమటం వేణుగోపాల్, నన్నపనేని భరత్ కుమార్, మంచాల రాజు, బలువారి విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే-ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, నేతలు పీవీ మదన్ మోహన్, సంగోజు రవి, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోష్, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, సోమనర్సయ్య, పిన్నా శివకుమార్, సాక్షి ఎడిషన్ ఇంచార్జ్ వర్ధెల్లి లింగయ్య, ఉర్దూ జర్నలిస్టుల అసోసియేషన్ బాధ్యులు గుల్షన్, సాజీద్ పాషా, సయీద్, నయీం పాల్గొన్నారు.
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డీఎం సతీష్, ఏడీఎం సంతోష్, సందీప్, వర్థినేని లక్ష్మణ్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ప్రతినిధులు బీమా విశిష్టత, పాలసీ ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు.

Leave Your Comments