అసలు డీజే ఎందుకు..? ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? | వినాయక నిమజ్జనాల్లో వరుస విషాదాలు | అందరి టీవీ#GaneshImmersion #GaneshVisarjan #DJ #NoisePollution #SoundPollution #Telangana #AndhraPradesh #PublicSafety #GaneshChaturthi #AndariTV

Date: 2026-09-21
news-banner


అందరి టీవీ డిజిటల్

1. వినాయక నిమజ్జనాల్లో డీజే మోతలు

2. గుండెపోటుతో వరుస మరణాలు

3. నల్గొండలో డ్యాన్స్ చేస్తూ రాము మృతి

4. తాడేపల్లిగూడెంలో ఈసు కుప్పకూలి మృతి

5. కర్నూలులో శివమ్మ మృతి

6. డోన్‌లో గణేశ్ గౌడ్ మృతి

7. సోమందేపల్లిలో శ్రీకాంత్ మృతి

8. గుత్తిలో అశోక్ కుమార్ మృతి

9. భారీ శబ్దాలపై వైద్యుల హెచ్చరిక

10. డీజేలపై నిషేధం ఉన్నా నియంత్రణ ఎక్కడ?

11. అసలు డీజే ఎందుకు?

12. ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?

వినాయక నిమజ్జనాల్లో డీజే మోతలకు గుండెలు అదురుతున్నాయి.

కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.


📍 నల్గొండ

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో గణేష్ శోభాయాత్ర జరిగింది.

శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ రాము (34) అనే వ్యక్తి మరణించాడు.

ఊరేగింపులో డ్యాన్స్ చేసిన రాము.. గణేష్ విగ్రహం తమ ఇంటి ముందుకు రాగానే మెట్లపై కూర్చున్నాడు.

కాసేపటికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు.

హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.


📍 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం

మరోవైపు శనివారం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ కాకర్లమూడి ఈసు అనే వ్యక్తి కుప్పకూలాడు.

వినాయకుడి ఊరేగింపులో ఈసు మరికొందరితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు.

వెంటనే అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఈసు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


📍 కర్నూలు రూరల్ మండలం

శుక్రవారం కర్నూలు రూరల్ మండలం ఈ. తాండ్రపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

డీజే శబ్ధం కారణంగా శివమ్మ (36) అస్వస్థతకు గురయ్యారు.

కాసేపటికే ఆమె గుండెపోటుతో మరణించారు.


📍 నంద్యాల జిల్లా డోన్

ఈ ఘటన జరిగిన రోజే శుక్రవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మరో విషాదం చోటుచేసుకుంది.

ఇందిరానగర్‌కు చెందిన గణేశ్ గౌడ్ (23) అనే యువకుడు వినాయక నిమజ్జనం వేడుకలో పాల్గొన్నాడు.

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అనంతరం గుండెపోటుతో మరణించాడు.


📍 ఉమ్మడి అనంతపురం జిల్లా

ఇక గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఇద్దరు మరణించారు.

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో శ్రీకాంత్ (35) అనే యువకుడు స్నేహితులతో ర్యాలీగా వెళుతుండగా కప్పుకూలిపోయాడు.

ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు తెలిపారు.

అదేరోజు అనంతపురం జిల్లా గుత్తి స్టేట్ బ్యాంకు కాలనీలో వినాయక మండపం వద్ద బుధవారం రాత్రి మైక్‌లో పాటలకు డ్యాన్స్ చేస్తూ అశోక్ కుమార్ (28) అనే యువకుడు కుప్పకూలిపోయాడు.

స్థానిక ఆస్పత్రికి తరలించి అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.


🩺 వైద్యులు ఏం చెబుతున్నారు..?

భారీ శబ్దాలు కూడా గుండెపోటుకు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా మానవుడి గుండె 60-80 డెసిబుల్స్ శబ్దాన్ని తట్టుకోగలదని చెబుతున్నారు.

కానీ వినాయక నిమజ్జన వేడుకల్లో వాడే డీజేలు 100 నుండి 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.

ఈ శబ్దానికి వచ్చే ప్రకంపనలకు గుండె లయ అస్తవ్యస్తం అవుతుంది.

దానికి తోడు నిద్రలేమి, ఆయాసం, శారీరక శ్రమ అధికంగా ఉండటం కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


🚨 వైద్యులు హెచ్చరిస్తున్నా మారని తీరు

అధిక శబ్దాల వల్ల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా..

డీజేలపై నిషేధం విధించినా మండపాల నిర్వహాకుల తీరు మారడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఒకరికంటే మరొకరు పోటీగా డీజేలను తీసుకువస్తున్నారు.

కొంతమంది అయితే ఏకంగా ఇతర రాష్ట్రాల నుండి సైతం బ్యాండ్, డీజేలను తీసుకువస్తూ వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తున్నారు.


❓ అసలు డీజే ఎందుకు?

ఇప్పుడు ప్రజల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది.

వినాయక నిమజ్జనానికి అసలు డీజే ఎందుకు?

భక్తితో నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో ఇంత భారీ శబ్దాలు ఎందుకు?

ఒకరిని మించి మరొకరు భారీ డీజేలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి?

నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదు?

శబ్ద కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు?

వరుసగా విషాద ఘటనలు జరుగుతున్నా.. డీజేలపై నియంత్రణ ఎందుకు కనిపించడం లేదు?

ప్రాణాలు కోల్పోయిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా?

భక్తి కార్యక్రమాలు ఆనందంగా జరగాలి..

నిమజ్జనం సంబరంగా సాగాలి..

కానీ ఆ సంబరాలు ఎవరి ప్రాణాలకూ ముప్పుగా మారకూడదు.

డీజే మోత కంటే భక్తి ముఖ్యం..
సంబరాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం.

Leave Your Comments