సూపర్ స్పెషాలిటీ కొలువులపై అప్రమత్తం.. దళారులను నమ్మొద్దు!#AndariTV#JobScam #Unemployment #JobAlert #TelanganaNews #BreakingNews

Date: 2026-08-08
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్: దళారుల మాయమాటలకు మోసపోవద్దు.. అధికారుల కీలక హెచ్చరిక.

వరంగల్: వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ప్రచారంపై అధికారులు అప్రమత్తం చేశారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో రూ.1,150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ వెలువడలేదని MGM అధికారులు స్పష్టం చేశారు.

స్టాఫ్ నర్సులు, పారామెడికల్, శానిటేషన్, సెక్యూరిటీ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు నిరుద్యోగులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు.

అధికారిక నోటిఫికేషన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి...

భవిష్యత్తులో ఆస్పత్రికి అవసరమైన వైద్య, నర్సింగ్, పారామెడికల్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు, నోటిఫికేషన్ వెలువడుతుందని అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలు, మెరిట్, రోస్టర్ విధానం ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వచ్చే తప్పుడు ఉద్యోగ ప్రకటనలు, వదంతులను నమ్మవద్దని నిరుద్యోగులకు సూచించారు. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ పోర్టల్స్, సంబంధిత వైద్యశాఖ ప్రకటనలను మాత్రమే పరిశీలించాలని కోరారు.

ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

అందరి టీవీ డిజిటల్ న్యూస్...అందరి టీవీ డిజిటల్ వరంగల్

ప్రతినిధి_కామిశెట్టి రంజిత్ కుమార్_9059738940



Leave Your Comments