బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9వ తేదీన నల్లబెల్లికి రానున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే,
తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
ANDARI TV – వరంగల్ జిల్లా ప్రతినిధి
దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ కార్యక్రమాలను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లికి చేరుకుని, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అదే రోజు నిర్వహించే సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
అలాగే 10వ తేదీన నిర్వహించే సంస్మరణ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమంలోనూ, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ బలోపేతంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఆయన మృతితో పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొన్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సంస్మరణ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో నాయకులు,
కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇది ANDARI TV DIGITAL... ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల గొంతుక.
రాజకీయాలు, సమాజం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సినిమా, పర్యాటకం సహా ప్రజలకు అవసరమైన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం.
మరిన్ని తాజా వార్తల కోసం ANDARI TV DIGITALను Subscribe చేయండి.