సమాజ సేవా సామ్రాట్ అవార్డుతో దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.#AndariTV #DigitalNews #DubbaSrinivas #SamajaSevaSamrat #Hyderabad

Date: 2026-08-03
news-banner
 అందరి టివి డిజిటల్ న్యూస్: సమాజ సేవా సామ్రాట్ అవార్డుతో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ కు సత్కారం.
హైదరాబాద్ నగరంలోని హరిహర కళాక్షేత్రంలో నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారికి "సమాజ సేవా సామ్రాట్ అవార్డు" ప్రదానం చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి సామాజిక సేవా సంస్థల్లో విశేష సేవలు అందిస్తున్న సేవాతత్పరులను గుర్తించి ఈ అవార్డులను అందజేశారు. కేవలం ఒకే వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గారి సేవలను నిర్వాహకులు కొనియాడారు.
రాజకీయ, సామాజిక రంగాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజల మనిషిగా నిరాడంబరంగా సేవలందిస్తున్నందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేంద్రవాడ వెంకటేశ్వర్, కోటా శంకర్ రావు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, లింబాద్రి (మున్సిపల్ చైర్మన్), పలువురు గురువులు హాజరయ్యారు.
తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులతో పాటు వరంగల్ జిల్లా నుంచి సదాశివుడు, బద్రి, కృష్ణ, రఘు, సంతోష్, రమేష్ తదితరులు, అలాగే దుబ్బా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దుబ్బా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave Your Comments