మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు.#AndariTV #DigitalNews #Narsampet #PeddiSudarshanReddy #GarikapatiMohanRao #BJP

Date: 2026-08-03
news-banner
అందరి టివి డిజిటల్ న్యూస్:
నర్సంపేట: ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన, వారి మరణం నర్సంపేట నియోజకవర్గానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ప్రజానాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు.
రాజకీయాలు వేర్వేరు అయినప్పటికీ ప్రజాసేవే ప్రతి నాయకుడి ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణ ప్రతాపరెడ్డి, ఎన్ఎస్ఆర్ అధినేత సంపత్ రావు, నియోజకవర్గ నాయకులు పుల్లారావు, మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ మండల అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్, జూలూరు మనిషి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు దుంక దువ్వ రంజిత్, యువ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.

Leave Your Comments