ANDARI TV DIGITAL / CINEMA DESK
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
ప్రముఖ నటుడు, విలన్ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.
కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన మేనేజర్ ధృవీకరించారు. గతంలో క్యాన్సర్‌ను జయించిన ఆయనకు వ్యాధి మళ్లీ తిరగబెట్టిందని, గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
హిందీతో పాటు తెలుగు, తమిళం సహా పలు భాషల్లో నటించిన ప్రదీప్ రావత్ విలక్షణమైన విలన్ పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యారు.
తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ‘సై’, ‘ఛత్రపతి’, ‘గజిని’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు చిరస్మరణీయంగా నిలిచాయి.
ప్రదీప్ రావత్ మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు
ANDARI TV DIGITAL తరఫున ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్‌కు నివాళులు.
ఇది ANDARI TV DIGITAL...
ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల గొంతుక.
రాజకీయాలు, సమాజం, సినిమా, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పర్యాటకం, సాంకేతికత, ఆధ్యాత్మికం... ఇలా ప్రతి రంగానికి సంబంధించిన తాజా వార్తలు, విశేషాలు, ప్రత్యేక కథనాలను మీకు అందించడమే మా లక్ష్యం.
తాజా సమాచారం కోసం ANDARI TV DIGITALను Subscribe చేయండి. వీడియోను Like చేయండి... Share చేయండి... మీ అభిప్రాయాన్ని Comment చేయండి.
మరో ముఖ్యమైన వార్తతో మళ్లీ కలుద్దాం... నమస్కారం.