నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'క్యాచ్ ది రైన్' అవగాహన కార్యక్రమం.#AndariTV #DigitalNews #Narsampet #CatchTheRain #WaterConservation

Date: 2026-08-01
news-banner
అందరి టివి డిజిటల్ న్యూస్|వరంగల్ జిల్లా నర్సంపేట:నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నర్సంపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో "క్యాచ్ ది రైన్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాన నీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ పద్ధతులు, భవిష్యత్ తరాలకు నీటిని ఎలా కాపాడాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నవీన్ కుమార్ విద్యార్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం.శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని, అందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని మున్సిపాలిటీ ద్వారా అందిస్తామని తెలిపారు.
అసిస్టెంట్ ఇంజనీర్ చంద్రమౌళి మాట్లాడుతూ భూమిపై అందుబాటులో ఉన్న నీటి వనరులు పరిమితమని, వాటిని సంరక్షించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత ఎదురవుతుందని హెచ్చరించారు.
అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై గార్డెన్ను సందర్శించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం.. శ్రీలక్ష్మిరామానంద్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, అసిస్టెంట్ ఇంజనీర్ చంద్రమౌళి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నవీన్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave Your Comments