అందరి టీవీ డిజిటల్ న్యూస్ :వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో ముస్కుల సాంబరెడ్డి అనే వృద్ధుడు హత్యకు గురైన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సాంబరెడ్డి ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో ఆరోగ్య కారణాలతో బట్టల్లోనే మలవిసర్జన చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన తమ్ముడి కుమారుడు ముస్కుల రాజిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం కర్రతో దాడి చేయడంతో సాంబరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.