తెలంగాణ అభివృద్ధికై శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

Date: 2024-07-13
news-banner


హైదరాబాద్ 13-07-2024 : హైదరాబాదులో  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి 
నివాసంలో జిల్లా అధ్యక్షులు మరియు వరంగల్  పశ్చిమ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు .
   ఈ సందర్భంగా  రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రివర్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు . ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి డా. రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.  గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పలను చేసింది . కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజా పాలనే తన లక్ష్యంగా శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం రేవంత్ రెడ్డి గారి తోనే సాధ్యం. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారి సూచన మేరకు నాయిని రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రశ్నించే గొంతుకగా వారు చెప్పిన సూచనలు అనుసరిస్తూ  ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో కేసులు మాపై పెట్టిన భయపడకుండా ఎదురు నిలిచి నాయిని రాజేందర్ రెడ్డి గారి అడుగులో అడుగై నడిచి రేవంత్ రెడ్డి గారు సూచించిన సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా పాల్గొ నందుకు చాలా సంతోషంగా ఉంది . ఏఐసీసీ టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ గా నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తూ గడిచిన ఎన్నికల్లో ప్రతిరోజు బిజెపి మరియు    బిఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తు,  వారికి కౌంటర్ ఇస్తూ  పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తూ శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రతి రోజు అహర్నిశలు  బడుగు బలహీన వర్గాలకు చేరువలో ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ ఎన్నికల్లోను మరియు పార్లమెంటు ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మరియు రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో నాయిని రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను . వరంగల్ అభివృద్ధికు మన ముఖ్యమంత్రివర్యులు కృషి చేస్తానని చెప్పడం సంతోషంగా ఉందని రామకృష్ణ గారు చెప్పుకొచ్చారు. నిత్యం ప్రజల్లో వుంటూ పేద ప్రజల సంక్షేమం కోసం పార్టీ కోసం ఇంకా అహర్నిశలు పని చేస్తానని డాక్టర్ రామకృష్ణ అన్నారు


image

Leave Your Comments