అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధీ
గ్రేటర్ వరంగల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ప్రేమికుల్లో అతడికి 47 సంవత్సరాలు కాగా, ఆమెకు మాత్రం 20 సంవత్సరాలు. పోలీసులు బాధితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ టు ప్రాంతానికి చెందిన వేల్పుగొండ స్వామి (47), లారీ డ్రైవర్ గా పని చేస్తుంటే వాడు
అదే ప్రాంతానికి చెందిన వెలిశాల గాయత్రి (20) ఇంటర్ వరకు చదువుకుంది. ఒకే ప్రాంతం సమీపంగా ఇండ్లు ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇందులో భాగంగా ఈనెల 2న ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరు పర్వతగిరి మండలం అన్నారం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి 12వ తారీకున పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వీరిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా స్వామి 13 సాయంత్రం మృతి చెందాడు. చికిత్స పొందుతున్న రమ్య సోమవారం ఉదయం మృతి చెందింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా, గాయత్రికి ఇంకా పెళ్లి కాలేదు.