అందరి టీవీ డిజిటల్ ,డెస్క్ ప్రత్యేకం
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కాగా.. సీబీఐ జూన్ 7న వేసిన ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితని రిలీజ్ చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సీబీఐ రీఫైలింగ్ చేసిన ఛార్జిషీట్‌లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణనను శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం రోజున విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఆమెకు బెయిల్ మాత్రం లభించడం లేదు. దీంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు