అందరి టీవీ డిజిటల్ వార్తలు / ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ఈ నెల 9,న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి!
అంటూ ఎఐటీయూసీ , టి.ఎం.ఆర్.పిస్, హనుమకొండ జిల్లా శాఖా పిలుపునిచ్చింది
ఈ సందర్భంగా ****
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు మంగళవారం న్యూ శాయంపేట హంటరోడ్ బస్ స్టాప్ కుడలిలో మున్సిపల్ సఫాయి కార్మికులతో
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్, మరియుTMRPS, సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్తంగా జరుగనున్న సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్మికుల సమావేశం జరిగింది
ఏఐటీయూసీ, హనుమకొండ జిల్లా సమితి అధ్యక్షులు వేల్పుల సారంగపాణి, ఏల్పుల ధర్మరాజు , బొట్ల భిక్షపతి మాదిగ మాట్లాడుతూ దేశంలోనే కార్మికులు దశాబ్ద కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను అమలు చేయకపోగా
కేంద్రం బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల హక్కుల చట్టాలను బడా పెట్టుబడుదారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయటాని కార్మికులంతా వ్యతిరేకించాలని కార్మిక హక్కులు ఉపసంహరించుకునే అంతవరకు ఐక్యమత్యంతో కార్మికులంతా పోరాడాలని
ఈ దేశంలోని ఉత్పత్తిలో బాగా సామ్యంగా 80% శాతం ఉన్న శ్రమజీవుల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి కానీ బిజెపి ప్రభుత్వం కేవలం ఈ దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులకు,సంపన్నులకు వారి వారి సంపత మరింత పెంచేందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యరిస్తున్నాయని ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసాగించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
ఈనెల 9, తేదీ లో దేశంలో ఉన్న కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని ఈ సమ్మె , రోజు ఏకశిలా పార్క్ దగ్గర నుండి హనుమకొండ జిల్లా కలెక్టర్ వరకు భారి ప్రదర్శనతో ప్రదర్శన ఉంటుందని కార్మికుల ప్రభావం కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని ప్రభుత్వానికి కనువిప్పు జరిగే విధంగా వేలాదిమంది సమ్మెలో పాల్గొనాలని వారికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జె.ఎ.సి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు భాస్కర్, ఎఐటీయుసి, నాయకులు బొక్క ఏలియా, మున్నంగి రఘు, అంకేశ్వరపు ఎల్లస్వామి,యం.డి. ఏక్బాల్ ,బొట్టు శ్రీనివాస్,మంద చిన్న, లక్ష్మి , రజిత,కోమల, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.