కొండగట్టుకు పోటెత్తిన భక్తులు - ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..!!Hanumanjayanthi special / AndariTv Digital News

Date: 2025-05-23
news-banner
అందరి టీవీ డిజిటల్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి 
జగిత్యాల,హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నను దర్శించుకునేందుకు వర్షంలోనూ కాలినడకన భక్తులు చేరుకున్నారు.

ఆంజనేయస్వామి మాలధారులు దీక్షా విరమణ చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున కొండగట్టులో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లను కలెక్టర్ పరిశీలించారు.

శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న అంజన్న క్షేత్రం
కొండగట్టు ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్‌ నామస్మరణతో మార్మోగుతోంది. హనుమాన్‌ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
image

Leave Your Comments