మా ప్రాంతానికి తరాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి ; మంత్రి సీతక్క
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి విజ్ఞప్తి చేసిన మంత్రి సీతక్క
సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
అందరి టీవీ డిజిటల్ / ch గంగాధర్ ,ములుగు జిల్లా ప్రతినిధి
హైదరాబాద్: బంజార హిల్స్ లోని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నివాసంలో ఆయనతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భేటీ అయ్యారు.గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే విధంగా ములుగు నియోజకవర్గంలో గోదావరి నది మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాలని ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందడం లేదని, ఎంత సాగునీరు అందక స్థానిక రైతులు తర తరాలుగా అన్యాయానికి గురవుతున్నారని సీతక్క వివరించారు. రామప్ప, లక్నవరం, పాకాల చెరువులతో పాటు ములుగు నియోజకవర్గం గుండా 100 కిలోమీటర్ల మేర గోదావరి పారుతున్నా, ఆ వనరులను వినియోగించుకునే విధంగా సాగునీటి ప్రాజెక్టు లేవని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే విధంగా గోదావరి నది మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లకు అనుమతులు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను అంద చేశారు. దీంతోపాటు రామప్ప- లక్నవరం కెనాల్ నిర్మాణం అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి సీతక్క విజ్ఞప్తికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సంకులంగా స్పందించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఫీజిబిలిటీ స్టడీ చేయించి, గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వగా మంత్రి సీతక్క కృతఙ్ఞతలు తెలిపారు.
ప్రాతిపదిక ప్రాజెక్టులు
రామప్ప నుండి లక్నవరం చెరువుకి నీటిని తరలియించడమా ద్వారా ఆ ప్రాంతం రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా టూరిజం ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది.
దేవాదుల పైప్లైన్ ద్వారా ఇంచo చెరువుకు గోదావరి నీటిని లిఫ్ట్ చేయాలి.
రామప్ప చెరువు నుండీ పోట్లాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఐదు గ్రామాలలోని 5 వేళ ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.
డి బి ఎం కాలువ ద్వారా జాకారం చెరువుకి నీటి మళ్లించి రైతులకు సాగునీటి అందించు ప్రాజెక్టు.
గౌరారం వాగును మల్లూరు ప్రాజెక్టులోకి మరలించడం ద్వారా ఆ ప్రాంత రైతులకి సాగునీరు అందించవచ్చు.
గిరిజన రైతుల భూములకు పాకాల చెరువు నుండి సాగునీరు అందించేలా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మిస్తే అది ఆయా మండలాలలో గిరిజన ప్రాంత రైతుల వ్యవసాయ అభివృద్ధి దోహదపడుతుంది.