అందరి టీవీ డిజిటల్ వార్తలు ,వరంగల్ జిల్లా ప్రతినిధి
వరంగల్ నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో పునాదుల్లో ఉన్న బండరాళ్లను బాంబులను వినియోగించి బ్లాస్ట్ చేయడంతో నగరంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఇష్టారీతిన కాంట్రాక్టర్ బాంబులు వినియోగిస్తున్నాడు,అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు
మిట్ట మధ్యాహ్నం బాంబులు వినియోగించి పేలుళ్లకు పాల్పడటం తో నగర ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
మోడల్ బస్ స్టాండ్ పునాది పనుల్లో బాంబు పేల్చడంతో ఎగిరిపడిన రాళ్లు. తాత్కాలిక బస్ స్టాండ్ లో నిలిచియున్న భూపాలపల్లి డిపో బస్సు పై పడడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి,
అక్కడ బస్సు ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది
మల్లి ఇలాంటి ఘటనలు జరుగకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు