అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి
గ్రామీణ ప్రాంత అడవి బిడ్డలకు మంగళవారం ఏటూరు నాగారం మండలంలోని కొమరం భీమ్ నగర్ ఆదివాసి గుత్తి కోయ అడవి బిడ్డలకు ములుగు ఎస్పీ శబరీష్ గారి ఆదేశాల మేరకు. ఏటూరు నాగారం ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ సూచనల మేరకు సిఐ అనుముల శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై ఏటూరు నాగారం తాజాద్దీన్ గారు 2024 జ్ఞాపకాలను వదిలి 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆదివాసి గుత్తి కోయ అడవి బిడ్డల జీవితాలలో నూతన వెలుగులు విరజిల్లాలని . కోరుతూ గుత్తి కోయ కుటుంబాలకు నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన వస్త్రాలు. పాదరక్షలు పంపిణీ చేశారు .
గతాన్ని మర్చిపోయి నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులకు సహకరించకూడదని వారికి ఆశ్రయం కల్పించకూడదని. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సహకరించిన చూస్తూ ఊరుకునేది లేదని చర్యలు తీసుకుంటామని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. గూడాలలోకి అనుమానస్పదంగా కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు జరగకుండా. గొడవలు అల్లర్లు సృష్టించకుండా శాంతియుత వాతావరణం లో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాత్రి 12 తర్వాత రోడ్లపై మద్యం సేవించి సంచరించిన డీజేలు అల్లర్లు గొడవలు సృష్టించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్. సి ఆర్ పి ఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు