అందరి టీవీ డిజిటల్ / జిల్లా ప్రతినిధి
ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది ,వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఐలోని చిరంజీవి (60) పై గిర్మాజీపేట లో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఐలోని శంకర్ (51) కత్తితో
వరంగల్ చౌరస్తా ప్రాంతంలో మెడపై కత్తి తో దాడి చేయడం తో తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇంతేజారి గంజ్ పోలీసులు
శంకర్ తో మాకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న చిరంజీవి భార్య..
తన కుమారుడిని కూడా చంపుతానంటూ శంకర్ సవాల్ విసురుతూ వెళ్ళాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న చిరంజీవి భార్య విజయ.