ప్రాణం తీసిన రెండు కుటుంబాల భూ వివాదం / Bhupalapalli District news / AndariTv Digital

Date: 2024-12-27
news-banner
అందరి టీవీ డిజిటల్ / భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 27
రెండు కుటుంబాల భూ తగాదాల మధ్య జరిగిన గొడవలు ఒకరి ప్రాణం తీసాయి కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెం కుచెందిన డోంగిరి   బుచ్చయ్య(55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సోదారి లింగయ్య అనే వ్యక్తి కుటుంబంతో గత కొన్ని ఏండ్లుగా భూవివాదం చెదరేగుతుంది, 

రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ వివాదంతో ఈరోజు ఒకరు ప్రాణాలు కోల్పోగా. మరో మహిళ కు తీవ్ర గాయాలయ్యాయి సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెం కు చెందిన డోంగిరి బుచ్చయ్య శుక్రవారం ఉదయం వివాదంగా ఉన్న సోదారి లింగయ్య భూమి దగ్గరికి వెళ్లారు. లింగయ్య, భార్య పద్మ , బుచ్చయ్య మొదట ఇద్దరు  గొడవ పడ్డారు. 

దీంతో బుచ్చయ్య ఆవేశం తో లింగయ్య భార్య పద్మను పారతో కొట్టడంతో లింగయ్య భార్య పద్మ తీవ్ర గాయాలపాలయింది. ఈ విషయాన్ని సోదారి లింగయ్య తన కుమారుడు సోదారి పవన్ కు చెప్పారు. తల్లి గాయపడిన విషయా న్ని తెలుసుకున్న పవన్ ఆవేశంతో ఇంటికి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో కాటారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని పశువుల ఆసుపత్రి మందు దొంగిరి బుచ్చయ్య కనబడ్డాడు. 

వెంటనే పవన్ అక్కడే ఉన్న కర్ర తీసుకుని బుచ్చయ్య తలపై కొట్టగా కింద పడి అక్కడికక్కడే మరణిం చాడు. రెండు కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూమికి ఎవరికి భూమిపై తగిన రికార్డులు లేవని, తెలిసింది,

గతంలో కుడా ఈ రెండు కుటుంబాలు ఘర్షణ పడగా కేసులు నమోదు చేసినట్లు సీఐ నాగార్జున రావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
image

Leave Your Comments