బలగం క్లైమాక్స్‌‌ సింగర్‌‌ మొగిలయ్య అనారోగ్యంతో మృతి. / Balagam Movie Singer Deth / AndariTv Warangal District News

Date: 2024-12-19
news-banner
అందరి టీవీ డిజిటల్ /వరంగల్ జిల్లా ప్రతినిధి 
కమీడియన్ గా మంచి గుర్తింపు పొందిన వేణు యెల్ధండి దర్శకత్వంలో దిల్‌‌ రాజు బ్యానర్‌‌ పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణ లో ఎంత  ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిని విషయమే. ఈ సినిమాలో క్లైమాక్స్‌‌ సాంగ్‌‌ తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి పాట ప్రజల గుండెలను హత్తుకుంది. ఈ పాటనే సినిమాకు గుండెకాయ అయ్యింది. ఈ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండి కి చెందిన కొంరమ్మ, మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచుర్యంలోకి వచ్చారు. కొంరమ్మ భర్త మొగిలయ్య ఈరోజు తెల్లవారు జామున ఆనారోగ్యంతో మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరక్టర్‌‌ వేణు యెల్ధండి, చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. ఈ మధ్యే పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌ ఈ మధ్యే రూ.లక్షా ఆర్థిక సాయం అందించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరక్టర్‌‌ వేణు యెల్ధండి, నటి నటులు సంతాపం ప్రకటించారు.

image

Leave Your Comments