అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా ప్రతినిధి
కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలి
అంగన్వాడి కేంద్రాలలో మెనో ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
సోమవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ కురవి, మహబూబాబాద్, మరిపెడ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు,
కురవి,మహబూబాబాద్ పట్టణం 11వ వార్డు, భవాని నగర్ కాలనీ, 16వ వార్డు, రామన్నపేట కాలనీ, మరిపెడ మండలం, అబ్బాయిపాలెం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి పక్క ఇండ్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సర్వే నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు సర్వే నివేదికలు ప్రభుత్వానికి ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించడం జరుగుతుందని అన్నారు,
ప్రభుత్వం సూచించిన ప్రకారం ఖచ్చితమైన సమాచారం క్షేత్రస్థాయిలో సేకరించాలని, సిబ్బందిని ఆదేశించారు,
సర్వే వివరాలను నిత్యం ఉదయం, సాయంత్రం పర్యవేక్షిస్తూ తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఇందిర ఇండ్ల సర్వే జరుగుతుందని అన్నారు,
కురవి మండల కేంద్రం,
మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు,
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సంబంధిత నిర్వాహకులను ఆదేశించారు,
ధాన్యానికి సంబంధించి రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే డబ్బులు పడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు,
ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం రావాల్సి ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు,
మరిపెడ మండలం, అబ్బాయిపాలెం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు,
పాఠశాలలో రుచికరమైన భోజనం అందించాలని, మంచి వాతావరణంలో విద్యబోదనలు అందించాలన్నారు,
అంగన్వాడి కేంద్రాలలో మెనో ప్రకారం పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని, శ్యామ్, మ్యామ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిత్యం పర్యవేక్షించాలని, గ్రామాల్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు హెల్త్, పౌష్టిక ఆహారం అందించెందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు,
మహబూబాబాద్ పట్టణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్ ను సందర్శించారు,
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ రవీందర్, డిప్యూటీ ఇంజనీర్ ఉపేందర్, కురవీ ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.