అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా లో 21 పరీక్ష కేంద్రాల్లో 7470 మంది అభ్యర్థులు గ్రూప్..2 పరీక్షలు రాస్తున్నారు.అధికారులు అభ్యర్థులను క్షుణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రాల లోనికి అనుమతిస్తున్నారు.
గ్రూప్...2 పరీక్ష తోలి
పేపర్ జనరల్ స్టడీస్....జనరల్ ఎబిలిటీ ( సామర్థ్యం)
10 గంటల నుండి మధ్యాహ్నము 12:30 గంటల వరకు కొనసాగునుంది.
గ్రూప్.. 2 పరీక్ష కేంద్రాల వద్ద 16 వ తేదీ సాయంత్రం వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమలులో ఉంటుంది.పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు 5 రి కి మించి గుంపులు గుంపులుగా ఉండరాదని , సభలు , సమావేశాలు , ధర్నాలు ,ర్యాలీలు , డీ.జే లకు అనుమతులను రద్దు చేశారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు , స్టేషనరీ దుకాణాలను మూసి వేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.